Updated : 11/09/2020 18:31 IST

నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఆమోదం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన చర్చలో కాంగ్రెస్‌, ఎంఐఎం,భాజపా సభ్యులు తమ సలహాలు, సూచనలు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ దానిపై సమాధానమిచ్చారు. బిల్లులో పొందుపర్చిన అంశాలపై సీఎం సుదీర్ఘంగా వివరించారు. అనంతరం నూతన రెవెన్యూ బిల్లుకు సంబంధించి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుబుక్‌ల బిల్లు-2020, తెలంగాణ గ్రామ అధికారుల రద్దు బిల్లు-2020లను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఎలాంటి సవరణలు లేకుండాలే కొత్త రెవెన్యూ బిల్లు ఆమోదం పొందింది. పలు ఇతర బిల్లులూ సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం శాసనసభను స్పీకర్‌ సోమవారానికి వాయిదా వేశారు.

ఇవీ చదవండి..

ఇది అంతం కాదు..ఆరంభం మాత్రమే: కేసీఆర్‌

ప్రతి అంశంలోనూ స్పష్టతివ్వాలి: శ్రీధర్‌బాబు

కొత్త రెవెన్యూ బిల్లుపై వాడీవేడీ చర్చ

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని