పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య 

కరోనా విజృంభణతో అంతర్జాతీయ సర్వీసులతో పాటు దేశీయ విమాన సర్వీసుల కార్యకలాపాలు రెండు నెలల పాటు నిలిచిపోయాయి. మార్చి 25న రద్దయిన దేశీయ విమాన సర్వీసుల సేవలు తిరిగి మే 25న

Published : 05 Oct 2020 23:39 IST

 

న్యూదిల్లీ: కరోనా విజృంభణతో అంతర్జాతీయ సర్వీసులతో పాటు దేశీయ విమాన సర్వీసుల కార్యకలాపాలు రెండు నెలల పాటు నిలిచిపోయాయి. మార్చి 25న రద్దయిన దేశీయ విమాన సర్వీసుల సేవలు తిరిగి మే 25న ప్రారంభమయ్యాయి. కొవిడ్‌-19 భయంతో విమానాల్లో ప్రయాణించటానికి తొలుత ప్రజలు కొంత మేర వెనకడుగు వేసినా ఇటీవల ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్క రోజే 1,458 దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 1,68,860కి పెరిగినట్లు విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. విమానయానంలో రంగం నెమ్మదిగా కుదురుకుంటోందని కరోనాకు ముందు ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని