ప్రపంచశ్రేణి పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో విశాఖ

ప్రపంచ శ్రేణి పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో విశాఖ చోటు సంపాదించింది. ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌గా రుషికొండ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

Published : 12 Oct 2020 01:19 IST

విశాఖ: ప్రపంచ శ్రేణి పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో విశాఖ చోటు సంపాదించింది. ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌గా రుషికొండ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. పర్యాటకానికి సరికొత్త శోభ తీసుకురావాలని భావించిన ప్రధాని మోదీ.. ఆ దిశగా దేశంలోని 13 బీచ్‌లను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న రుషికొండ బీచ్‌.. మూడేళ్లలో రూ.7కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.  గత నెలలో నేషనల్‌ జ్యూరీ.. రుషికొండ బీచ్‌తో పాటు మరో ఏడు బీచ్‌లను ఎంపిక చేసి వాటి వివరాలను డెన్మార్క్‌లోని పర్యావరణ అవగాహన సంస్థ ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌’కు పంపింది. వాటిలో రుషికొండ ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌గా అర్హత సాధించడం సంతోషంగా ఉందని ఏపీ టూరిజం సీఈవో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. బీచ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని.. 7 నక్షత్రాల హోటల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని