ఎట్టకేలకు చిరుత చిక్కింది

 రాజేంద్రనగర్‌, శంషాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో  ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ..

Published : 11 Oct 2020 09:32 IST

 హైదరాబాద్‌ :  రాజేంద్రనగర్‌, శంషాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో  ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. గత కొన్ని నెలలుగా ఇక్కడే సంచరిస్తూ దాడులకు పాల్పడుతోంది. నిన్న రాజేంద్రనగర్‌లోని వాలంతరి ఆవరణలో ఓ పశువుల పాకలో ఆవు దూడలపై దాడి చేసి రెండు దూడలను చంపేసింది.  తెల్లవారుజామున పాక వద్దకు వచ్చిన యజమాని బాబా చనిపోయిన దూడలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చనిపోయిన దూడలను ఎరగా అక్కడే ఉంచారు.

ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి మళ్లీ పశువుల పాక వద్దకు వచ్చిన చిరుత అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను అటవీశాఖ అధికారులు జూపార్కుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని