అశ్వవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Updated : 23 Oct 2020 21:01 IST

తిరుమల: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహన సేవ నిర్వహించారు. వాహన సేవలో ఏపీ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారికి స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని