అత్యవసరమైతే తప్ప బయటకు వద్దు:కిషన్‌రెడ్డి

రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రహోంశాఖ

Updated : 14 Oct 2020 02:10 IST

హైదరాబాద్‌: రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఈ సమయంలో లోతట్టు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి సహాయ చర్యల్లో పాల్గొనటానికి స్వచ్ఛంద సేవకులు, వాలంటీర్లు, పౌరులు ముందుకు రావాలని కోరారు. 
తాను కూడా వ్యక్తిగతంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీతో మాట్లాడి సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు. 
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా సహాయ కార్యక్రమాల కోసం మరో రెండు బృందాలు ఈ రాత్రికి విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకోనున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే అధికారులను సంప్రదించాలని కిషన్‌రెడ్డి సూచించారు. అవసరమైతే స్థానిక దళాలకు సహాయం చేయడానికి సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ తదితర పారామిలిటరీ దళాలను తీసుకు రావడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని