అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌: తీర్పు రిజర్వు

ఈఎస్‌ఐ మందులు కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయిన తెదేపా శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న అనంతరం అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. తీర్పు ఈనెల 29న వెలువరించే

Published : 27 Jul 2020 14:33 IST

అమరావతి: ఈఎస్‌ఐ మందులు కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయిన తెదేపా శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న అనంతరం అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. తీర్పు ఈనెల 29న వెలువరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని