Andhra News: ఏపీలో లక్ష మంది ‘అమ్మఒడి’కి దూరం... 27న నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేలు చొప్పున ప్రభుత్వం జమచేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకంలో..

Published : 22 Jun 2022 18:47 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమచేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికిపైగా కోత పెట్టింది. పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది. వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.

‘‘విద్యుత్తు వాడకం నెలకు 300యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదు. నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా అమ్మఒడి ప్రయోజనం పొందలేరు. బియ్యం కార్డు కొత్తది ఉండాలి. కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలి’’ అని ఈ పథకానికి అర్హతలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు