Nellore: నెల్లూరులో అంగన్వాడీల నిరసన.. ఈడ్చి పడేసిన పోలీసులు

తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు చేస్తున్న నిరసన నెల్లూరులో ఉద్రిక్తంగా మారింది.

Updated : 20 Jan 2024 15:02 IST

నెల్లూరు: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు చేస్తున్న నిరసన నెల్లూరులో ఉద్రిక్తంగా మారింది. సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి వీఆర్‌సీ సెంటర్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలనే నినాదాలతో హోరెత్తించారు. దీంతో చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు కిలోమీటర్‌ మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ క్రమంలో పోలీసులు-అంగన్వాడీల మధ్య తోపులాట జరిగింది. పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని