Raghurama: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు.

Updated : 12 Jan 2022 16:07 IST

హైదరాబాద్‌: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వచ్చారు. 17న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత ఆ నోటీసులు తనకు అందించాలని రఘురామ కుమారుడు పోలీసులను కోరగా వారు నిరాకరించారు. నేరుగా రఘురామకే అందజేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆయనకే అందజేసి వెళ్లారు. అయితే రఘురామకు అందించిన నోటీసులు ఏ కేసుకు సంబంధించినవి అనేది తెలియాల్సి ఉంది.

తన సొంత నియోజకవర్గం నరసాపురం పర్యటనకు రేపు వెళ్తున్నట్లు ఇప్పటికే రఘురామ ప్రకటించారు. రెండు రోజులపాటు నియోజకవర్గంలో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని