Ap news: పింఛన్ల పంపిణీపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. రాత్రికల్లా మార్గదర్శకాలు!

సోమవారం రాత్రి కల్లా ఏపీలో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు.

Published : 01 Apr 2024 17:28 IST

అమరావతి: పింఛన్ల పంపిణీపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు సూచించారు. వారంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ ఇబ్బంది లేదని, నగరాలు, పట్టణాల్లో కొంచెం కష్టతరమవుతుందని చెప్పారు. ఒకవేళ గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేస్తే.. సౌకర్యాలు కల్పించాలని కొందరు కలెక్టర్లు సీఎస్‌కు వివరించారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎస్‌ ఈ రాత్రికి పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని