Andhra News: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు.. కేబినెట్ ఆమోదం

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరును మార్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీని వైఎస్ఆర్ హెల్త్...

Updated : 21 Sep 2022 05:17 IST

అమరావతి: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరును మార్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు మార్పు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్ ఆమోదం కూడా తీసుకుంది. ఆన్‌లైన్‌లోనే దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపడం గమనార్హం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని