
AP News: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టులో విచారణ
అమరావతి: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 142ను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ, ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.