AP High Court: టెట్‌, డీఎస్సీ నిర్వహణ పిటిషన్లపై విచారణ వాయిదా

టెట్‌, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

Published : 19 Feb 2024 20:39 IST

అమరావతి: టెట్‌, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అభ్యర్థులకు సరిపడా సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని, హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌లోనూ సరైన విధానాలు పాటించడం లేదని గతంలో పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై న్యాయస్థానం విచారణ జరిపింది. 2022 డీఎస్సీ పరీక్షల నిర్వహణ సమయంలో రెండు నెలలు సమయం ఇచ్చి.. ఇప్పుడు ఎందుకు తొందర పడుతున్నారని, అభ్యర్థులకు సరిపడా సమయం ఎందుకు ఇవ్వట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. దాంతోపాటు పరీక్ష ప్రక్రియ ఐదు వారాల్లో పూర్తి చేయాలని నిర్ణయించడంపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరాలు లేవనెత్తారు. మార్చి 14న టెట్‌ ఫలితాలు ప్రకటించి, డీఎస్సీకి మార్చి 15న పరీక్ష నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని