Adimulapu Suresh: తూచ్‌.. అలా అనలేదు: మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరణ

గురు పూజోత్సవం సందర్భంగా ఒంగోలులో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh)చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.

Updated : 06 Sep 2023 21:06 IST

అమరావతి: గురు పూజోత్సవం సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh)చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.  ‘‘బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్‌ల్లో వచ్చింది. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చింది. గురువులకి తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతున్నాయి. గురువుల కన్నా గూగుల్‌ మేలు’’ అంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. గురువుల కన్నా గూగుల్‌ మేలని తాను వ్యాఖ్యలు చేసినట్టుగా దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ఆ తరహా వార్తలను తాను ఖండిస్తున్నట్టు వెల్లడించారు. మారుతున్న కాలానికి సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని కొంత మంది గూగుల్‌పై ఆధారపడుతూ గురువులను మర్చిపోతున్నారన్న ఉద్దేశంలో తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం కలిగిన వ్యక్తిగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని మంత్రి అన్నారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉపాధ్యాయులతో సత్ససంబంధాలు కలిగి ఉన్నానని మంత్రి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని