Viveka murder case: వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి బెయిల్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది.

Updated : 11 Mar 2024 17:44 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తు సమర్పించాలని, ప్రతి సోమవారం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో ట్రయిల్‌ జరిగే సమయంలో ఏపీలో ఉండకూడదని షరతు విధించింది. అలాగే ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 2021 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో శివశంకర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. బెయిల్‌ మంజూరు కావడంతో ఆయన మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై పులివెందులకు వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని