Viral video: ఫుడ్‌ డెలివరీ డ్రోన్‌పై పక్షి దాడి..

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వెళుతున్న ఓ డ్రోన్‌పై కాకి దాడిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.....

Published : 27 Sep 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫుడ్‌ డెలివరీ సంస్థలు అందుబాటులోకి రావడం ఆహార ప్రియులకు వరంగా మారింది. ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్‌ చేసిన కొద్ది నిమిషాలకే అది వారిముందు ప్రత్యక్షమవుతోంది. ఆర్డర్లు పెరుగుతుండటంతో జోరు పెంచిన కొన్ని విదేశీ సంస్థలు.. డెలివరీలకు డ్రోన్లను వినియోగిస్తున్నాయి. అయితే డ్రోన్‌ డెలివరీ కొంచెం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. డెలివరీ సమయంలో పలు ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వెళుతున్న ఓ డ్రోన్‌పై కాకి దాడిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బెన్‌ రోబెర్ట్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసి డెలివరీ కోసం వేచిచూస్తున్నాడు. ఆ పార్సిల్‌ను డ్రోన్‌ తీసుకొస్తుండగా.. ఆ డ్రోన్‌ను ఓ కాకి వెంబడించింది. డ్రోన్‌పై ముక్కుతో దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆ డెలివరీని డ్రోన్‌ అక్కడే జారవిడిచింది. ఆర్డర్‌ కోసం వేచిచూస్తున్న బెన్‌ రోబెర్ట్‌ ఈ తతంగాన్నంతా వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం పక్షులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. పక్షుల స్థలాలను ఆక్రమించుకొని మానవులు ఈ రకంగా కూడా వాటికి ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని