Published : 22/04/2021 16:18 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు: ఆళ్ల

కరోనా కట్టడిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏపీలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్‌ సబ్‌ కమిటీ) కీలక సమావేశం నిర్వహించింది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని నేతృత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, కన్నబాబు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, వైద్యనిపుణుల నియామకం, రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు మంత్రి చెప్పారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కొంతమేర ఆక్సిజన్‌ కొరత ఉండగా.. డిమాండ్‌కు సరిపడా ఆక్సిజన్‌ అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆళ్ల నాని వెల్లడించారు. ప్రస్తుతం 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం అవుతోందన్నారు. ఆక్సిజన్‌ సమీకరణకు ఇతర రాష్ట్రాలతో చర్చలు జరపడం సహా సొంత ప్లాంట్‌ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తామని తెలిపిందన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల పెంపుపై దృష్టి సారించినట్లు చెప్పారు. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 104 కాల్‌ సెంటర్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఔషధాలు, ఆక్సిజన్‌ కొరత దేశవ్యాప్తంగా ఉందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇబ్బందులు ఉన్నా.. ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే వసూలు చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 49 లక్షల మందికి టీకాలు వేశామన్నారు. 18 ఏళ్లు నిండివారికి వ్యాక్సినేషన్‌పై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. రేపు సీఎం జరిపే సమీక్షలో నేటి సమావేశంలోని నిర్ణయాలపై చర్చించనున్నట్లు ఆళ్ల నాని తెలిపారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని