Polavaram project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగైదు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది.

Updated : 29 Aug 2023 21:01 IST

దిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగైదు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది. పోలవరంపై అంతర్గత సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. యాక్షన్ ప్లాన్‌ మేరకు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్‌కు యాక్షన్‌ ప్లాన్‌ తయారీ బాధ్యతలు అప్పగించింది. డయాఫ్రం వాల్‌, గైడ్‌బండ్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థతో కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించింది. తద్వారా ప్రాజెక్టు వద్ద లోటుపాట్లు బయటపడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని