icon icon icon
icon icon icon

YS sharmila: తండ్రి పేరును జగనే ఛార్జిషీట్‌లో చేర్పించారు: షర్మిల

న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Updated : 30 Apr 2024 12:47 IST

రావులపాలెం: ఇవి న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ ఓడిందంటే.. నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్సేనని ఆరోపిస్తున్నారు. ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేకపోతే ఏఏజీ సుధాకర్‌రెడ్డి చేర్పించారు. మూడు కోర్టుల్లో పిటిషన్లు వేయించారు. సుధాకర్‌రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్‌ఆర్‌ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఆ కేసుల నుంచి జగన్‌ బయటపడాలంటే ఆయన పేరును ఛార్జిషీట్‌లో చేర్చాలనేది వారి ఉద్దేశం. కుమారుడై ఉండి కూడా తండ్రి పేరును చేర్పించారు. ఇలా ఎవరైనా చేస్తారా?ఎంత దుర్మార్గమిది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవిని జగన్‌ కట్టబెట్టారు. తండ్రి పేరు ఛార్జిషీట్‌లో చేర్పించిన దుర్మార్గం గురించి ఆంధ్రా ప్రజలు ఆలోచించాలి. గత ఐదేళ్లుగా.. జగన్‌ రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని మోదీ చేతిలో  ఉంది’’ అని షర్మిల మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img