CM Jagan: వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభం.. ట్రాక్టర్‌ నడిపిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు.

Updated : 07 Jun 2022 16:16 IST

గుంటూరు: వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఊపి వాటిని ప్రారంభించిన అనంతరం స్వయంగా ఆయన ట్రాక్టర్ నడిపారు. 

అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ హార్వెస్టర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 40 శాతం రాయితీతో ట్రాక్టర్లు, యంత్రపరికరాలు అందిస్తున్నామని.. రైతులు 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. మిగతా 50 శాతాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తున్నట్లు జగన్‌ వివరించారు. ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా నిలుస్తున్నామని.. విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు జగన్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని