CM Kcr: నిమ్స్‌లో ‘దశాబ్ది’ బ్లాక్‌ నిర్మాణం.. సీఎం కేసీఆర్ శంకుస్థాపన

రెండు వేల పడకల సామర్థ్యంతో నిమ్స్‌లో నిర్మించనున్న కొత్త బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.1,571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బ్లాక్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

Published : 14 Jun 2023 14:53 IST

హైదరాబాద్‌: రెండు వేల పడకల సామర్థ్యంతో నిమ్స్‌లో నిర్మించనున్న కొత్త బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.1,571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బ్లాక్‌ నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త బ్లాక్‌ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త బ్లాక్‌కు దశాబ్ది బ్లాక్‌గా నామకరణం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘వైద్యారోగ్య శాఖ అనేది చాలా ముఖ్యమైనది. 2014లో ఆరోగ్య శాఖకు రూ.2,100 కోట్లు కేటాయించాం. 2023-24లో రూ.12,367 కోట్లు కేటాయించాం. సొంతంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. తెలంగాణ వచ్చాక వైద్యారోగ్య శాఖ అనేది ఎంతో కీలకం అని భావించాం. న్యూట్రిషన్‌ కిట్‌ ఇవ్వడం వెనక చాలా ఆలోచన ఉంది. ఈ కిట్లతో ఒక తరం ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. గతంలో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌ లాంటి ఆస్పత్రులే దిక్కు. వరంగల్‌లో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఆస్పత్రి కడుతున్నాం. హైదరాబాద్‌లో మరో 4 ఆస్పత్రులు కడుతున్నాం. వైద్యారోగ్య రంగంపై చక్కటి ప్రణాళికలు రూపొందించాలి. ఈ శాఖకు సహజంగా విమర్శలే ఎక్కువ. ఈ శాఖ సేవలపై మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని