Telangana News: మరో 86 గురుకుల పాఠశాలలకు జూనియర్‌ కళాశాలల స్థాయి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం శాశ్వత ప్రాతిపదికన స్టడీ సర్కిళ్లు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నివేదిక సిద్ధం చేయాలని

Published : 01 Jul 2022 19:35 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం శాశ్వత ప్రాతిపదికన స్టడీ సర్కిళ్లు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నివేదిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురుకులాల సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశమైన ఆయన.. గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రంలో మరో 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. అందులో 75 ఎస్సీ, 7 ఎస్టీ, 4 బీసీ పాఠశాలలున్నాయి. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులకు స్పష్టం చేశారు. అన్ని గురుకులాల్లో పరిశుభ్రత కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు, వంట సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని