ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (23-08-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (23-08-2022)

Updated : 23 Aug 2022 03:32 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం.

 మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గరాధన శుభప్రదం.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది.

చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికై వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

 ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.  

శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. దైవారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు.

 మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఇష్టులతో  కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

చేపట్టే పనిలో అనుకూల ఫలితాలున్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

 

మీమీ రంగాల్లో ఓర్పు పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వలన విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

మీమీ రంగాల్లో ఓర్పు పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వలన విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.    

స్థిరమైన ఆలోచనలతో మంచి చేకూరుతుంది. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని