
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24-01-2022)
డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ధర్మసిద్ధి ఉంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఆటంకాలు ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈశ్వరధ్యానం శుభప్రదం.
కాలానుగుణంగా ముందుకుసాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
ఆప్తుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.
కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చంద్రశేఖరాష్టకం పఠించాలి.
అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. శివారాధన శుభప్రదం.
వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ధనలాభం, మనఃసంతోషం కలుగుతాయి. ఓర్వలేనివారున్నారు. సందర్భానుసారంగా ముందుకు సాగితే మేలు. అష్టలక్ష్మి స్తుతి మంచిది.
అనుకున్న ఫలితాలున్నాయి. శ్రమఫలిస్తుంది. ఆర్థిక విషయాలలో ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనులను మధ్యాహ్నం తరువాత చేయడం ఉత్తమం. ఇష్టదేవత సందర్శనం శుభప్రదం.
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగకుండా చూసుకోవాలి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజనం సౌఖ్యం కలదు. లక్ష్మి ఆరాధన మంచిది.
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మనోబలం సడలకుండా చూసుకోవాలి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.
Advertisement