Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/06/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఆలోచనా విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.శివ అష్టోత్తరం చదవాలి.
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీశివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో లాభం పొందుతారు. శ్రీలక్ష్మీ స్తోత్రం చదివితే బాగుంటుంది.
శుభకాలం. విశేషమైన ప్రగతి సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభప్రదం.
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. సూర్యాష్టకం చదవడం శ్రేయస్కరం.
చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు.ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గోసేవ చేయడం మంచిది.
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
మీ మీ రంగాల్లో ముందుచూపునకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉన్నత పదవీ యోగం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
మనఃస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..
-
Mansion 24 Trailer: ఆ భవంతిలోకి వెళ్లిన వారందరూ ఏమయ్యారు: ‘మాన్షన్ 24’ ట్రైలర్