Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/11/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. 

Updated : 07 Nov 2023 00:20 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించటం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. 

అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శ్రేయస్కరం.

మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితాదేవి స్తుతి శుభకరం. 

అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తిశ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. విష్ణు ధ్యానంతో మనోబలం పెరగడంతో పాటు శుభప్రదం.

మనఃస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

ప్రారంభించబోయే పనుల్లో దేహజాఢ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని విషయంలో అశ్రద్ధ చేయవద్దు. శ్రీహరి  ఆరాధన శుభప్రదం.

 

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త  మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కనకధారాస్తవం చదవాలి.

ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ నామాన్ని జపించడం ఉత్తమం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని