దశాబ్దాల వివాదం.. ఒక్క రాత్రితో ముగిసిపోదు

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న వివాదం ఒక్క రాత్రిలో ముగిసిపోయేది కాదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె అన్నారు.

Published : 04 Jun 2021 01:04 IST

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె

దిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న వివాదం ఒక్క రాత్రిలో ముగిసిపోయేది కాదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె అన్నారు. రక్షణ పరమైన ఏర్పాట్లను సమీక్షించడంలో భాగంగా ఆయన ప్రస్తుతం కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ఆపితేనే ఇరు దేశాల మధ్య వివాదాలు తొలగేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యత పూర్తిగా పాకిస్తాన్‌దే అన్నారు. ఉగ్ర కార్యకలాపాలకు స్వస్తి పలికితేనే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని కొద్ది రోజుల క్రితం నరవణె చెప్పిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా పరిస్థితుల దృష్ట్యా కాల్పుల విరమణ ఒప్పందం ఓ కీలకమైన ముందడుగని ఆయన పేర్కొన్నారు. రక్షణ సంబంధమైన అంశాల్లో భారత్‌ ప్రాధాన్యాలను పాక్‌ గుర్తించాలన్నారు. సరిహద్దు వెంట యుద్ధ వాతావరణానికి ఆజ్యం పోసే విధానాలను విరమించుకోవాలని దాయాది దేశానికి హితవు పలికారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని