Telangana News: ఆందోళన వద్దు.. ఫోర్త్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం: డీహెచ్‌

గత రెండేళ్లుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయతో కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు.

Updated : 24 Dec 2022 19:20 IST

యాదాద్రి: ఏసు క్రీస్తు ప్రభువు దయతో కరోనా తగ్గిందన్న వ్యాఖ్యలతో విమర్శలు చుట్టుముట్టిన వేళ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రీశుడి దయతో కొవిడ్‌ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉన్నందున.. కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం డీహెచ్‌ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కొవిడ్‌పై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకోవాలని సూచించారు. గత రెండేళ్లుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయతో కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్నా.. మరణాల శాతం ఉండబోదని, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని డీహెచ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని