Skin care: టాన్‌ బాధిస్తోందా.. ఇలా చేయండి!

ఎండలు బాబోయ్‌ ఎండలు...! ఈ వేసవిలో చర్మానికి వచ్చే సమస్యలు ఒకటీ రెండూ కాదు. అందులో టాన్‌ సమస్య ఒకటి. మరి సమస్య ఉంటే పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి కదా! 

Published : 29 May 2022 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎండలు బాబోయ్‌ ఎండలు...! ఈ వేసవిలో చర్మానికి వచ్చే సమస్యలు ఒకటీ రెండూ కాదు. అందులో టాన్‌ సమస్య ఒకటి. మరి సమస్య ఉంటే పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి కదా!

రోజూ ముఖాన్ని కడుక్కోవాలి: రోజూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అందమైన ముఖ సౌందర్యం మీ సొంతమవుతుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణనిస్తుంది. డార్క్‌ స్పాట్స్‌ను తగ్గిస్తుంది. రోజుకి రెండుసార్లు ఫేస్‌ వాష్‌ చేసుకోవాలి.

ఫేస్‌ సీరం: డామేజ్‌ అయిన చర్మాన్ని ఫేస్‌ సీరం కాపాడుతుంది. డార్క్ సర్కిల్స్‌ను తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. మంచి సీరం చర్మాన్ని మాయ చేసినట్లు మెరిపిస్తుంది.

స్ర్కబ్‌ చేసుకోండి:  మీరు ఎన్ని క్రీములు వాడినా వారానికి రెండుసార్లు తప్పనిసరిగా స్ర్కబ్‌ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం ద్వారా చర్మం ఎక్సోఫోలియేట్‌ అయ్యి కాంతివంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కలబంద, గులాబి ఉన్న స్ర్కబ్‌ను వాడటం ఉత్తమం.

శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోండి: ముఖ్యంగా వేసవిలో శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు పండ్ల రసాలు, నీటిని ఎక్కువగా తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఈ చిన్న చిన్న పద్ధతులతో ఆరోగ్యవంతమైన, అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు