TTD: 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెన్లు రద్దు: తితిదే ఈవో

ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెన్లు రద్దు చేయనున్నట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Updated : 02 Feb 2024 19:07 IST

తిరుమల: ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెన్లు రద్దు చేయనున్నట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో తితిదే, పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

భక్తుల సౌకర్యార్థం 3.5 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ పెట్టుకోవాలని సూచించారు. వాహన సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. వాహన సేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో తెలిపారు. ఆ రోజు ప్రత్యేక దర్శనాలు (వీఐపీ బ్రేక్‌, వయోవృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు) ఉండవని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు