TS: వర్సిటీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు

తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక వర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రెండు

Published : 10 Apr 2021 01:13 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక వర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రెండు విశ్వవిద్యాలయాల్లో కలిపి 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులకు ఈ ఏడాది మార్చి 31న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు నేపథ్యంలో మార్చి 31న జారీ చేసిన నోటిఫికేషన్‌కు తాజాగా టీఎస్‌పీఎస్‌సీ అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లోని పోస్టులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఈనెల 19 నుంచి మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని