జనవరి 3 నుంచి యథావిధిగా పెట్రోల్‌ సరఫరా.. ఆందోళన వద్దు: పెట్రోల్‌ పంపుల అసోసియేషన్‌

జనవరి 3వ తేదీ నుంచి పెట్రోల్‌ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దని తెలంగాణ పెట్రోల్‌ పంపుల అసోసియేషన్‌ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి తెలిపారు.

Updated : 02 Jan 2024 22:07 IST

హైదరాబాద్‌: జనవరి 3వ తేదీ నుంచి పెట్రోల్‌ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దని తెలంగాణ పెట్రోల్‌ పంపుల అసోసియేషన్‌ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి తెలిపారు. ట్రక్‌ డ్రైవర్లు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమ్మె చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడిందన్నారు. డ్రైవర్స్‌తో మాట్లాడి వారి అనుమానాలను నివృత్తి చేశామని చెప్పారు. ఎక్కడా పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దన్నారు. కొందరు కృత్రిమంగా పెట్రోల్‌ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అమరేందర్‌ రెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు