సచివాలయం కోసం విశాఖలో భవనాల వేట

విశాఖలో వివిధ శాఖల రాష్ట్ర కార్యాలయాల కోసం ఉన్నతాధికారులు వెతుకులాట ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, ఇతర ప్రతినిధులు గత కొన్ని రోజులుగా విశాఖకు వస్తున్నారు. విశాఖలో

Published : 09 Jan 2020 09:12 IST

విశాఖపట్నం: విశాఖలో వివిధ శాఖల రాష్ట్ర కార్యాలయాల కోసం ఉన్నతాధికారులు వెతుకులాట ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, ఇతర ప్రతినిధులు గత కొన్ని రోజులుగా విశాఖకు వస్తున్నారు. విశాఖలో సచివాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉందని భావిస్తున్న మిలీనియం టవర్‌ భవనాన్ని పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఐఐసీ ఎండీ రజత్‌భార్గవ బుధవారం పరిశీలించారు. మిలీనియం టవర్‌ వెనుక భాగంలో నిర్మిస్తున్న టవర్‌-బి పనుల ప్రగతిని పరిశీలించారు. మిలీనియం టవర్లో ఉన్న వసతుల గురించి ఏపీఐఐసీ అధికారులు వివరించారు. రెండో టవర్‌ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న విషయాలపైనా చర్చించారు. నగరానికి వచ్చిన ఆయన్ను పలువురు ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిసి సంప్రదింపులు జరిపారు.
ఐటీహిల్స్‌లోనే ఉన్న కనకదుర్గా హెల్త్‌ సర్వీసెస్‌ సంస్థ భవనాన్ని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులు పరిశీలించారు. ఆ భవనంలో వసతుల గురించి భవన యజమాని సాంబశివరావుతో సంప్రదింపులు జరిపారు. ఐటీహిల్స్‌లోనే సుమారు 1.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చేలా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం వద్దకు పలు శాఖల అధికారులు వెళ్తున్నారు. ఆ భవనం మొత్తాన్ని అద్దెకు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని