మాయమవుతున్న ‘చిరుత’

దేశంలో చిరుత పులుల సంఖ్య 75 నుంచి 90 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ స్టడీస్‌ ఇండియా (సీడబ్ల్యూఎస్‌ ఇండియా) పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన..

Published : 07 Feb 2020 23:45 IST

బెంగళూరు: దేశంలో చిరుత పులుల సంఖ్య 75 నుంచి 90 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ స్టడీస్‌ ఇండియా (సీడబ్ల్యూఎస్‌ ఇండియా) పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారత ఉపఖండంలోని వివిధ ప్రదేశాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు చిరుత పులుల సంఖ్య భారీ స్థాయిలో పడిపోయినట్లు వారు గుర్తించారు. ఈ మేరకు అధ్యయనానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు.

వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకి చెందిన పరిశోధకులు సుప్రియా భట్‌, సువంకర్‌ బిస్వాస్, బివాస పండవ్‌, సామ్రాట్‌ మొండల్‌, సీడబ్ల్యూఎస్‌కి చెందిన పరిశోధకుడు డాక్టర్‌ కృతి కె.కరంత్‌ నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది. భారత ఉపఖండంలోని వివిధ ప్రదేశాల నుంచి 56 మల నమూనాలను వారు సేకరించారు. అప్పటికే వారివద్ద అందుబాటులో ఉన్న 143 చిరుత పులులకు సంబంధించిన డేటాతో పోల్చి చూశారు. గతంతో పోల్చిచే చిరుత పులుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. ‘రెండు పూర్తి విభిన్న విధానాలు ద్వారా నిర్వహించిన అధ్యయనంలో విస్తుగొలిపే అంశాలను గుర్తించాం. భారత ఉపఖండంలో చిరుత పులులకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ వాటి సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గిపోవడం భయాన్ని కలిగిస్తోంది. కేవలం సంఖ్యా పరంగానే కాకుండా సంతానోత్పత్తిలో కూడా వీటి సంఖ్య తగ్గినట్టు గుర్తించాం. అంతరించిపోయే స్థితికి చేరుకున్న పెద్ద పులుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల మాదిరిగానే చిరుత పులల విషయంతో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts