18న కరీంనగర్‌లో ఐటీ టవర్‌ ప్రారంభం

‘కేసీఆర్‌ ఉండగా.. గల్ఫ్‌ బాట దండగా’ అన్న నినాదంతో ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

Published : 11 Feb 2020 00:44 IST

కరీంనగర్‌: ‘కేసీఆర్‌ ఉండగా.. గల్ఫ్‌ బాట దండగా’ అన్న నినాదంతో ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఈ నెల 18న ఐటీ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా కరీంనగర్‌లో ఐటీ టవర్‌ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు తుది దశకు చేరిన ఐటీ టవర్ నిర్మాణ పనులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. అంతేకాకుండా ఐటీ కంపెనీలకు ఆకర్షణీయమైన రాయితీలు ఇస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. కరీంనగర్‌ ఐటీ టవర్‌లో ఇప్పటికే 25 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. ఐటీ టవర్‌ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వినోద్‌కుమార్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని