పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై కమిటీ

తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై పొంగులేటి సుధాకర్‌ రెడ్డి...

Published : 20 Feb 2020 18:40 IST

దిల్లీ: తెలంగాణపై పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావం అంశంలో అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై భాజపా నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఎన్జీటీలో ఇవాళ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. తెలంగాణలో ముంపు ప్రభావంపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించనుంది. కమిటీ నివేదిక అందించిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని ఎన్జీటీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు