విద్యుత్‌శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో విద్యుత్‌ విక్రయించే సంస్థలకు అనుకూల విధానం ఉండాలని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ రూపొందించాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో...

Updated : 26 Feb 2020 17:24 IST

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ విక్రయించే సంస్థలకు అనుకూల విధానం ఉండాలని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ రూపొందించాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఏపీలో విద్యుత్‌ ప్లాంట్లు పెట్టేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా చూడాలన్నారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఏటా రైతులకు ఆదాయం వస్తుందని.. భూమిపై హక్కులు వారికే ఉంటాయన్నారు. మరో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఎన్టీపీసీ ముందుకొస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. ఆ సంస్థకు భూమి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్‌.. వీలైనంత త్వరగా ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ కోసం విద్యుత్‌ ఫీడర్లు ఏర్పాటు చేయాలని..  వచ్చే రెండేళ్లలో ఫీడర్ల ఆటోమేషన్‌ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని