కరోనాపై ఉపాసన జాగ్రత్తలు

సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే ఉపాసన కొణిదెల తాజాగా కరోనా వైరస్‌పై పలు జాగ్రత్తలు చెప్పారు. హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినప్పటి నుంచి అందరూ ఆందోళనకు గురవుతున్నారు.

Published : 04 Mar 2020 01:25 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తాజాగా కరోనా వైరస్‌పై పలు జాగ్రత్తలు చెప్పారు. హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినప్పటి నుంచి అందరూ ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టు చేశారు.
‘సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కరోనా కేసు గుర్తించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ రోగిని గాంధీ ఆసుపత్రికి తరలించాం. అక్కడ ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. ప్రభుత్వం పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పలు సూచనలు చేశారు. అవేంటంటే..
* జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటివి ఈ వ్యాధికి లక్షణాలు. వీటిల్లో ఏమైనా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోండి.
ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదు. అయినా సరే మాస్కులు ధరించడం మంచిది.
* బయట తిరిగి వచ్చిన తర్వాత, తినే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

* ఈ వైరస్‌కు యాంటీ బయాటిక్స్ లేవు. కాబట్టి వైద్యులు చెప్పకుండా ఎలాంటి మాత్రలు వేసుకోవద్దు.
* దగ్గు, తుమ్ములు వచ్చే వాళ్ల నుంచి కనీసం 3 అడుగులు దూరంగా ఉండండి. 
వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించండి. 
* ఉడకబెట్టని మాంసం తినవద్దు అంటూ ఉపాసన సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని