కంట్రోల్‌ రూంల ద్వారా నిరంతర పర్యవేక్షణ

ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు రేపు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనతా కర్ఫ్యూ పాటిద్దామని.. ఇంట్లోనే ఉంటూ మద్దతు తెలపాల్సిందిగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌...

Published : 22 Mar 2020 01:54 IST

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు రేపు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనతా కర్ఫ్యూ పాటిద్దామని.. ఇంట్లోనే ఉంటూ మద్దతు తెలపాల్సిందిగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూని ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని సూచించారు. అత్యవసర సేవలు అందించేందుకు రేపు స్టేషన్లలో పోలీసులు అందుబాటులో ఉండాలంటూ డీజీపీ ఆదేశాల జారీ చేశారు. కర్ఫ్యూ నేపథ్యంలో పోలీస్‌ కంట్రోల్‌ రూంల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని డీజీపీ వివరించారు. డయల్‌ 100 ద్వారా సేవలు పొందాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని