‘ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయండి’

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఓటాన్‌ అకౌంట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా కూడా ఆమోదించుకునే అవకాశముందని...

Published : 23 Mar 2020 20:53 IST

ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఓటాన్‌ అకౌంట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా కూడా ఆమోదించుకునే అవకాశముందని నివేదించింది. 2004లోనూ ఇదే తరహాలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నపుడు ఆర్డినెన్స్‌ ద్వారా ఓటాన్‌ అంకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించారని గుర్తుచేసింది. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వీలైనంత వరకు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు తెలిపారు. కరోనా నిరోధక చర్యల్లో పాల్గొంటున్న క్షేత్రస్థాయి ఉద్యోగులకు అన్ని ఉపకరణాలూ అందించాలని కోరామన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సచివాలయ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. విరాళాల కోసం ఇతర ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని