బస్సులు నడవకున్నా.. బాధ్యత తీసుకున్నారు 

టికెట్టు కొట్టిన చేతులు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగస్వామ్యులయ్యాయి. స్టీరింగ్‌ పట్టిన చేతులు సామాజిక దూరంపై అవగాహన కల్పిస్తున్నాయి. చైనా మహమ్మారిని..

Updated : 05 Apr 2020 22:24 IST

చిత్తూరు: టికెట్టు కొట్టిన చేతులు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగస్వామ్యులయ్యాయి. స్టీరింగ్‌ పట్టిన చేతులు సామాజిక దూరంపై అవగాహన కల్పిస్తున్నాయి. చైనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు మేము సైతం అంటున్నారు.. చిత్తూరు జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు. కండక్టర్లు, డ్రైవర్లు సైనికుల్లా మారి పోలీసులకు సహకారం అందిస్తున్నారు.

వినూత్న ఆలోచన..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు వినూత్నంగా ఆలోచించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు నడుం బిగించారు. క్షేత్రస్థాయిలో పోలీసులతో కలిసి పనిచేస్తూ.. ప్రజలకు సామాజిక దూరం, కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

పోలీస్‌ స్టేషన్లకు అనుసంధానం

జిల్లా వ్యాప్తంగా 14 ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో పని చేస్తున్న సుమారు 731 మంది ఉద్యోగులను ఈ సేవలకుగానూ ఆర్టీసీ స్వచ్ఛందంగా కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్‌ స్టేషన్లకు వీరిని అనుసంధానం చేసింది. పోలీసులకు అవసరమైన చోట వీరు సహకారం అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈవిధంగా ప్రజాసేవలో భాగస్వాములు కావడం గర్వకారణమని ఆర్టీసీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని