పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు.
పొరపాటు చేస్తే ఓటు చెల్లదు
ఓటు కోసం వరుసలో ఉద్యోగులు
న్యూస్‌టుడే, రాంనగర్ : ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఇంకా రెండు రోజులు మాత్రమే గడువుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేది ఉద్యోగులు, ఉపాధ్యాయులే అయినా.. చిన్న పొరపాట్ల కారణంగా తిరస్కరణకు గురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఉద్యోగుల ఓట్లు తిరస్కరించారు. లోక్‌సభ ఎన్నికల్లో సమస్య ఏర్పడకుండా, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
చెల్లుబాటు కావాలంటే..
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు కావాలంటే ఉద్యోగులు జాగ్రత్తగా ఓటు వేయాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా మొత్తంలో 988 ఓట్లు తిరస్కరణకు గురికాగా, అందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 304 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మీ ఆర్డర్ కాపీతో పాటు ఓటరుకార్డు లేదా ఆధార్‌కార్డు నియోజకవర్గంలోని అధికారికి చూపిస్తే.. పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఏ, బీ, సీ అని మూడు కవర్లు ఇస్తారు. ఫారం ఎ (డిక్లరేషన్) ఇది పేపర్ రూపంలో ఉంటుంది. దీనిపై మన వివరాలు రాసి మన సంతకంతో పాటు, గెజిటెడ్ అధికారి సంతకం తీసుకోవాలి. గెజిటెడ్ అధికారిని అందుబాటులో ఉంచుతారు. బ్యాలెట్లో నచ్చిన అభ్యర్థికి టిక్ కొట్టి డిక్లరేషన్‌తో పాటు బ్యాలెట్ పత్రాన్ని చిన్న కవర్లో పెట్టి, రెండింటికి కలిపి పెద్ద కవర్లో పెట్టి అక్కడే ఉంచి ట్రంక్ పెట్టెలో వేయాలి. కవర్లు తారుమారైనా.. మీది, గెజిటెడ్ అధికారి సంతకాలు లేకపోయినా.. టిక్ సరిగా చేయకపోయినా.. బ్యాలెట్‌పై అదనపు రాతలున్నా.. మీ ఓటు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. -
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
జిల్లాలోని చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో సిట్ విచారణ చేపట్టింది. వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్ ఈశ్వర్, గ్రామస్థులను అధికారులు విచారించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది -
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
స్థానిక ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో సిట్ బృందం దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు
శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, నిండిపోయాయి. -
ఇసుకపై.. డేగకన్ను
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
వంగిపోయారా? లొంగిపోయారా?
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్‌తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్‌ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!