3 కోట్ల భోజనాల పంపిణీ: నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ‘మిషన్‌ అన్నా సేవ’ ద్వారా దేశ వ్యాప్తంగా 3 కోట్ల భోజనాలు పంపిణీ చేయనున్నట్లు ఆ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు నీతా అంబానీ వెల్లడించారు. ఓ కార్పొరేట్‌ ఫౌండేషన్‌ తరఫున అందిస్తున్న..

Updated : 08 Dec 2022 17:44 IST

ముంబయి: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ‘మిషన్‌ అన్నా సేవ’ ద్వారా దేశ వ్యాప్తంగా 3 కోట్ల భోజనాలు పంపిణీ చేయనున్నట్లు ఆ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు నీతా అంబానీ వెల్లడించారు. ఓ కార్పొరేట్‌ ఫౌండేషన్‌ తరఫున అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద భోజన పంపిణీగా ఈ కార్యక్రమం నిలువనున్నట్లు ఆమె పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీల బోర్డు డైరెక్టర్లలో ఒకరైన నీతా అంబానీ ఉద్యోగులతో మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇది కఠినమైన సమయం. సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ‘మిషన్‌ అన్నా’ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలైన దినసరి కూలీలు, మురికి వాడల్లోని ప్రజలు, ఫ్యాక్టరీల కూలీలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు 3 కోట్ల భోజనాలు అందించనున్నాం’ అని తెలిపారు. కరోనాపై పోరులో భారతదేశపు అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా దేశంలోనే మొదటి కొవిడ్‌-19 ఆసుపత్రిని నిర్మించింది. పీపీఈ కిట్లు, మాస్కులు సైతం అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని