న్యాయవాదుల సంక్షేమానికి రూ.25 కోట్లు మంజూరు

రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. మొదటి విడతగా వెంటనే రూ. 15 కోట్లు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్

Published : 05 May 2020 22:15 IST

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. మొదటి విడతగా వెంటనే రూ. 15 కోట్లు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఏజీ చెప్పారు. న్యాయవాదులకు అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్‌కు అడ్వొకేట్ జనరల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను హైకోర్టు ద్వారా న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు ఏజీ వివరించారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు ఏజీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని