నిమ్మగడ్డ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ వ్యవహారంపై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుమారు 5 గంటలపాటు వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని.. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

Published : 05 May 2020 19:31 IST

అమరావతి: మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ వ్యవహారంపై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుమారు 5 గంటలపాటు వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని.. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు వినిపించేందుకు ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఒకరోజు గడువు ఇచ్చింది. ఎల్లుండి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం సాయంత్రానికి విచారణ పూర్తయ్యే అవకాశముంది.

ఇదీ చదవండి..

..మరి పురపాలక ఎన్నికలకు ఎస్‌ఈసీ రమేశ్‌కుమారేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని