కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేక చర్యలు

జీహెచ్ఎంసీ ఆధునాత‌న ప‌ద్ద‌తుల‌తో నిర్మిస్తున్న 14 శ్మశాన వాటికల ప‌నులు వేగ‌వంతం చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Published : 07 Jul 2020 03:55 IST

పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌


 

హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ ఆధునాత‌న ప‌ద్ద‌తుల‌తో నిర్మిస్తున్న 14 శ్మశాన వాటికల ప‌నులు వేగ‌వంతం చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మాసబ్‌ ట్యాంకు ఎంఏయూడీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. దీనికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, జోనల్‌ కమిషనర్లు, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు. క‌రోనా క‌ట్ట‌డిలో  జీహెచ్ఎంసీ, వైద్య‌, ఆశా వ‌ర్క‌ర్లు, అంగన్​వాడీల సేవలు వెల‌క‌ట్ట‌లేనివని అర్వింద్‌ కుమార్‌ కొనియాడారు. 

‘‘క‌రోనాతో చ‌నిపోయినవారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే గుర్తించిన హిందు, ముస్లిం, క్రిస్టియన్​ శ్మశాన వాటికల్లో పరిస్థితులను మెరుగుపరచాలి. అవ‌స‌ర‌మైన చోట తాత్కాలిక షెడ్లు​,  ప్రహరీల నిర్మాణాలను చేపట్టాలి. శ్మ‌శాన వాటిక‌ల వ‌ద్ద జీహెచ్ఎంసీ ఉద్యోగులకు షిఫ్ట్​ల వారీగా  విధులు కేటాయించాలి. న‌గ‌రంలోని ఆసుపత్రులు, ప్రధాన ఏరియాల్లో 24 గంటలపాటు పర్యవేక్షించాలి. దీనికోసం ప్ర‌త్యేక బృందాలను ఏర్పాటు చేయాలి’’ అని అర్వింద్‌ కుమార్‌ ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని