మాజీ మంత్రి రామస్వామి మృతి

భాజపా నేత, మాజీ మంత్రి రామస్వామి(80) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Updated : 09 Jul 2020 23:32 IST

హైదరాబాద్‌: భాజపా నేత, మాజీ మంత్రి రామస్వామి(80) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడ్డం రామస్వామి మరణం పార్టీకి, పేదలకు తీరని లోటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా అభ్యున్నతికి ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చేవరకు గడ్డం తీయనని శపథం చేసిన గొప్పనేత అని కొనియాడారు. 
రామస్వామి మృతికి హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని