NTPC: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి ప్రారంభం

ఎన్టీపీసీ రామగుండంలో నిర్మిస్తోన్న తెలంగాణ ప్రాజెక్ట్‌లో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది.

Updated : 24 Mar 2023 09:30 IST

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ రామగుండంలో నిర్మిస్తోన్న తెలంగాణ ప్రాజెక్ట్‌లో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు  ఒకటో యూనిట్‌లో సింక్రనైజేషన్‌ పూర్తిచేశారు. 2017లో నిర్మాణ పనులు మొదలు పెట్టగా..  మూడు రోజుల క్రితం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బాయిలర్‌ లైటప్‌ చేసిన అనంతరం విద్యుత్‌ ఉత్పత్తి దశలోకి తీసుకొచ్చారు. ఈ రోజు  ఉదయం వరకు 100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. ఈ మేరకు ఎన్టీపీసీ  ఈడీ సునీల్‌ కుమార్‌ .. అధికారులు, ఉద్యోగులకు స్వీట్లు పంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని