AP CID : తెదేపా నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు

తెదేపా నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.

Updated : 25 Mar 2023 12:05 IST

అనకాపల్లి :  తెదేపా నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోషల్‌ మీడియాలో పోస్టుల వ్యవహారంలో మార్చి 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నంలోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే.. విజయ్‌ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో.. ఆయన తండ్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడికి అందజేశారు. మరోవైపు కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా నోటీసులు ఇస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు